ఉప్పల్ టెస్ట్‌లో భారత్ ఘన విజయం
- Details
- Published on Tuesday, 05 March 2013 12:25
ఉప్పల్ టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో కంగారులను ధోనీసేన చిత్తుగా ఓడించింది. .. భారత స్పిన్నర్ల ధాటికి నాలుగో రోజు తొలి సెషన్‌లోనే ఆసీస్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. అశ్విన్, జడేజా చెలరేగడంతో ఆసీస్ మిడిలార్డర్ పెవిలియన్ దారి పట్టింది.
దాంతో రెండు గంటల వ్యవధిలోనే చివరి ఎనిమిది వికెట్లను ఆసీస్ కోల్పోయింది. ఈ విజయంతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది. ఇక టెస్ట్ల్లో 22వ విజయం నమోదు చేసి ధోనీ కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. టీమిండియా విజయంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.











