రెండో రోజూ ఆట: భారత్ కు 74 పరుగుల ఆధిక్యం
- Details
- Published on Sunday, 03 March 2013 17:24
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత్ వికెట్ నష్టానికి 311 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 74 పరుగుల ఆధిక్యం దక్కింది. పూజారా, విజయ్ సెంచరీలతో భారీ స్కోరుకు బాటలు వేశారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 294 పరుగుల భాగస్వామ్యం జోడించారు. రెండో రోజూ ఆట ముగిసే సమయానికి పూజారా 162, విజయ్ 129 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.











