- Details
-
Category: రాష్ట్రీయం
-
06
Mar
2013
-
Published on Wednesday, 06 March 2013 19:14
మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర బుధవారం నరసరావుపేట నియోజకవర్గంలో సాగింది. నరసరావుపేట పట్టణం పాత పల్నాడు బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ సాయంత్రం షర్మిల పాల్గొన్నారు. సభ ప్రారంభమైన తర్వాత భారీ వర్షం కురిసింది. వర్షంలోనే తడుస్తూనే షర్మిల ప్రసంగం కొనసాగించారు. జనం కూడా వర్షంలోనే తడుస్తూనే ఆమె ప్రసంగం విన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనంతో పాత పల్నాడు సెంటర్ పోటెత్తంది.