Wed19062013

Last updateWed, 19 Jun 2013 9pm

Back You are here: Home న్యూస్ బిట్స్ న్యూస్ రాష్ట్రీయం లోకేష్కు ఫీజు ఎవరు చెల్లించారు? :శ్రీకాంత్

లోకేష్కు ఫీజు ఎవరు చెల్లించారు? :శ్రీకాంత్


టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ విదేశాల్లో చదవడానికి కట్టిన ఫీజు డబ్బులు ఎక్కడివో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లోకేష్కు వచ్చిన మార్కులకు రాష్ట్రంలోని చిన్న కాలేజీలో కూడా సీటు రాదన్నారు. మరి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీటు కోసం డబ్బులు ఎవరు కట్టారని ఆయన ప్రశ్నించారు. దీనిపై విచారణకు చంద్రబాబు సిద్ధమేనా? అని ఆయన అడిగారు. ఏ ఆస్తులు అమ్మి చంద్రబాబు ఫీజులు కట్టారో చెప్పాలన్నారు. చంద్రబాబు తన కుటుంబ సభ్యులందరినీ మనీ లాండరింగ్కు వాడారని ఆరోపించారు. తమ ఆరోపణలకు సమాధానం చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. నీతి నిజాయితీ ఉంటే చంద్రబాబు స్వయంగా తనపై విచారణ జరిపించుకోవాలన్నారు. లోకేష్, చంద్రబాబుల విదేశీ యాత్రల గుట్టు బయటపెట్టగలరా? అని అడిగారు. బ్రదర్ అనిల్ స్పందనపై టీడీపీ, బీజేపీ నేతలు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేసేవారిపై బ్రదర్ అనిల్ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారని తెలిపారు.

 

AddThis Social Bookmark Button

Law Point

JA Teline IV
Friday @ 9PM

Praja Prasthanam

JA Teline IV
@ 9.30AM

The Prime Time Show

JA Teline IV
Mon to Thu @ 9PM

Ding Dong

JA Teline IV
wed & Sat @ 8.30PM

Bhavita

JA Teline IV
Sunday @ 9.30AM