అధికారికంగా పవర్ హాలిడే: విజయమ్మ
- Details
- Category: రాష్ట్రీయం
-
04 Mar 2013
- Published on Monday, 04 March 2013 13:48
అధికారికంగా ప్రభుత్వం పవర్ హాలిడే పెట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన మహాధర్నాలో విజయమ్మ మాట్లాడుతూ... కరెంట్ కోతల వల్ల కొన్ని వేల పరిశ్రమలు మూతపడ్డాయని, లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెల్లో 12గంటలు దాకా కరెంట్ కోతలు విధిస్తున్నారని వెల్లడించారు.
రైతులు నేడు కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి దాపురించిందని వాపోయారు. తుఫాన్ల నష్ట పరిహారం రైతులకు అందడంలేదన్నారు. విద్యుత్ ఉత్పత్తి తగ్గిన సంగతి ప్రభుత్వానికి ముందుగా తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇళ్లకూ ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీయని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలు ఒక్కటీ సరిగా లేవని ధ్వజమెత్తారు. వైఎస్సార్ ఒక్క పైసా కూడా ఛార్జీలు పెంచకుండా కరెంట్ చక్కగా ఇచ్చారని విజయమ్మ గుర్తు చేశారు.











