ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్న సర్కార్
- Details
- Category: రాష్ట్రీయం
-
02 Mar 2013
- Published on Saturday, 02 March 2013 16:38
ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ ప్రభుత్వం జైళ్లలో పెడుతోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుతంత్రాలను కోర్టుల్లో ఎదుర్కొంటామని ఆయన శనివారమిక్కడ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లతో జవాబిస్తామని అసదుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ 55 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని దారుస్సలాంలో జరిగిన కార్యక్రమంలో అసద్ మాట్లాడారు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల ఘటన దేశంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. తీవ్రవాదులకు మతం లేదని, వారిపై జాలి చూపాల్సిన అవసరం లేదన్నారు. కాగా అనారోగ్య కారణాల వల్ల అక్బరుద్దీన్ ఒవైసీ గైర్హాజరు కాగా, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యక్రర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.











