ప్రజలే దేవుళ్లు ప్రజాబలమే అండ
- Details
- Category: రాష్ట్రీయం
-
25 Dec 2012
- Published on Tuesday, 25 December 2012 14:56
దివంగత ముఖ్యమంత్రి డా॥వైఎస్. రాజశేఖరరెడ్డి ఆంధ్రరాష్ట్ర ప్రజలకోసం అవిశ్రాంతంగా శ్రమించి పలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రూపొందించారు. ముఖ్యంగా 108, 104, అభయహస్తం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత కరెంటు, వృధ్యాప్య పించన్లు, రుణమాఫీ వంటి పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజల వద్దకు చేరేలా చేశారు. అధికారులు మృదు స్వభావంతో వ్యవహరిస్తూ, ప్రతిలబ్దిదారుడి ఇంటి ముందర వరకు వెళ్లేవారు!
అలాగే 12 గంటల కరెంటుతో వై.ఎస్. రైతులకు చేరువయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే తొలి హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దారు. అలాంటి రాజన్న రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో తల్లడిల్లారు. ఆయన ప్రమాద వార్త తెలిసిన అభిమానులు ఎందరో టీవీ చూస్తూ గుండె ఆగి మరణించారు. మా రాజన్న ఇక లేడని - ఇక రాడని కండ్లవిసేలా రోదిస్తూ దిక్కులేని పక్షులమయ్యామని మాకు దిక్కు ఎవరని రోదిస్తుంటే, రాష్ట్రం శోక సముద్రంతో ఉంటే ఏం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం?
ఏమీ చేయకపోగా మానవత్వాన్ని మరిచి రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని రోజుకొక విధంగా వేధింపులకు గురిచేస్తోంది. ఒక మహానాయకుని అకాల మరణంతో ప్రజలు దిక్కులేని పక్షుల్లా రోదిస్తుంటే, ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుందే కానీ, ఆయన మరణానికి తట్టుకోలేక మృతిచెందిన బాధిత కుటుంబాలను పరామర్శించలేదు, కనీసం స్పందించలేదు. ‘‘మేమిస్తాం కదా, ఆయన ఇవ్వడం ఎందుకు?’’ అన్న కాంగ్రెస్.. తర్వాత ఆ మాటే మర్చిపోయింది. జగన్‌మోహనరెడ్డి తను ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర ప్రారంభించి, ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ, పల్లెపల్లెలో పర్యటిస్తూ ప్రజలకు భరోసా ఇస్తుంటే ఆయన్ని అక్రమంగా జైలుపాలు చేసింది.
ఇదంతా చూస్తుంటే ఇంతటి ఘోరమైన ప్రభుత్వం ఎక్కడా లేదనిపిస్తోంది. ఉపఎన్నికల ముందు జగన్‌మోహనరెడ్డిని అరెస్టుచేసి ఈ ప్రభుత్వం ఏం సాధించింది? ఆయన పార్టీ 15 సీట్లు గెలిచింది. జైల్లో ఉన్న మా జగనన్న ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ, ప్రజాభిమానం పొందుతున్నాడు. ఆ కుటుంబానికి ప్రజలే దేవుళ్లు. ప్రజా బలమే అండ.
- అయిరే ఎల్లయ్య, పెద్దకోడప్‌గల్, నిజామాబాద్ జిల్లా
మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail:
This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.











