నల్ల దుస్తులతోనే ఉంటా: తనికెళ్ల భరణి
- Details
- Category: రాష్ట్రీయం
-
24 Dec 2012
- Published on Monday, 24 December 2012 16:44
ఢిల్లీ గ్యాంగ్‌రేప్ నిందితులకు శిక్షపడేవరకు తాను నల్లటి దుస్తులే ధరిస్తానని సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. సోమవారం ఉదయం సాక్షి టీవీ స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొన్న ఆయన మహిళలపై జరుగుతున్న దాడులపట్ల ఉద్వేగానికి లోనయ్యారు.
యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తనికెళ్ల భరణి ఖండించారు. ఢిల్లీ ఘటన తర్వాత తన కుమార్తె కళ్లలోకి కూడా సూటిగా చూడలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీలతో కాలయాపన చేయకుండా నిందితులకు వెంటనే శిక్షపడేలా చూడాలని సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు.











