రజనీకాంత్ ఒక్కడే సూపర్ స్టార్: దాసరి
- Details
- Category: రాష్ట్రీయం
-
20 Dec 2012
- Published on Thursday, 20 December 2012 16:05
ప్రముఖ నటుడు రజనీ కాంత్ ఒక్కడే భారత సూపర్ స్టార్ అని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు అన్నారు. ఆయనతో సమానమైన వారు మరొకరు లేరని అన్నారు. నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత దాసరి ఓ సినిమా ఫంక్షన్‌కు హాజరయ్యారు. దర్శకుడు సురేష్‌కృష్ణ రాసిన 'బాషాతో నేను' పుస్తకాన్ని దాసరి గురువారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. రజనీ సూపర్‌స్టార్ అన్న విషయాన్ని సినిమా రంగానికి చెందిన వారందరూ ఒప్పుకున్నారని దాసరి గుర్తు చేశారు. దర్శకరత్న దాసరి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తాను ఎంతో మందికి లైఫ్ ఇచ్చానని, అడ్రస్‌లు ఇచ్చానని అన్నారు. ఒకప్పుడు వేషాలు ఇస్తే ఇప్పుడు గౌరవం ఇవ్వడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు











