బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు!
- Details
- Published on Tuesday, 25 December 2012 16:25
సేలం సమీపంలోని సాతాంపట్టి వద్ద బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. పేలుళ్ల జరిగే సమయానికి సుమారు 40 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఐదు మృతదేహాల వెలికితీసినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 20 మందిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వార్త అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.











