త్వరలో రైల్వే చార్జీల బాదుడు
- Details
- Published on Monday, 24 December 2012 18:25
రైల్వే శాఖ తీవ్ర నష్టాల్లో ఉందని కేంద్రం ప్రకటించింది.సుమారు రూ.20 వేల కోట్లకు పైగా నష్టాలున్నాయని కేంద్రం చెబుతుంది. ఈ నష్టాలను భర్తీ చేయడానికి రైల్వేశాఖ.. చార్జీల పెంపు ద్వారా రూ.4 వేల కోట్ల ఆదాయాన్ని భర్తీ చేసుకోవాలని యోచిస్తోంది. వచ్చే బడ్జెట్‌లో కిలో మీటర్‌కు 5 నుంచి 10 పైసలు పెంచాల్సి ఉంటుందని రైల్వేశాఖ ప్రకటిచింది. ''రైల్వే ఆర్థిక పరి స్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికుల చార్జీలు పెంచాల్సిన అవసరముందని రైల్వే శాఖ చెబుతోంది. సాధ్యమైనంత త్వరగా ఈ పెంపును చేయాలని సర్కార్ భావిస్తుంది.
భద్రతాప్రమాణాలు మెరుగుపర్చడానికి, కొత్తలైన్లు, గేజ్‌మార్పిడి, డబ్లింగ్‌కు సంబందించిన ప్రాజెక్టులు త్వరితగతిన చేపట్టడానికి భారీగా నిధులు అవసరం ఉంది. ఈ నేపధ్యంలో చార్జీలు పెంచి ఈ లోటును భర్తీ చేయడానికి రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం రైల్వే ఆర్థిక స్థితిగతులు దారుణంగా ఉన్నందున వెంటనే పెంపుపై నిర్ణయం తీసుకోవాలని రైల్వేశాఖ చూస్తుంది. సాధారణ, స్లీపర్, థర్డ్ ఏసీ తరగతుల్లో చార్జీలు గత తొమ్మిదేళ్లుగా పెరగలేదు. ఈ నేపథ్యంలో 2012-13 బడ్జెట్‌లో ఆ చార్జీలను 10 శాతం నుంచి 15 శాతం మేర పెంచాలని అప్పటి రైల్వే మంత్రి దినేష్ త్రివేది ప్రతిపాదించారు. అయితే అనంతరం ఆయన రాజీనామాతో పెంపు ప్రతిపాదన అమలు కాలేదు.మరికొన్ని రోజుల్లో రైల్వేచార్జీల మోత మ్రోగనుంది.











