ఢిల్లీ గ్యాంగ్ రేప్‌ను నిరసిస్తూ చెన్నైలో భారీ ర్యాలీ
- Details
- Published on Monday, 24 December 2012 15:16
ఢిల్లీ గ్యాంగ్ రేప్‌ను నిరసిస్తూ.. చెన్నైలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నామ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ప్రముఖ సినీ నటి సుహాసిని పాల్గొన్నారు. మెరీనా తీరం నుండి సుమారు రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. మహిళలపై దాడులు, అత్యాచారాలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తేవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.











