Fri24052013

Last updateFri, 24 May 2013 7pm

Back You are here: Home న్యూస్ బిట్స్ న్యూస్ జాతీయం త్వరలో రైల్వే బాదుడు!

త్వరలో రైల్వే బాదుడు!

రైల్వే చార్జీల పెంపుపై కసరత్తు జరుగుతోంది. కిలోమీటరుకు 5 పైసల నుంచి 10 పైసల మేర బాదుడుకు రంగం సిద్ధమవుతోంది. దాదాపు రూ.20 వేల కోట్లకు పైగా నష్టాలతో సతమతమవుతున్న రైల్వేశాఖ.. చార్జీల పెంపు ద్వారా రూ.4 వేల కోట్ల ఆదాయాన్ని భర్తీ చేసుకోవాలని యోచిస్తోంది.

‘‘2013-14 రైల్వే బడ్జెట్‌లో ప్రయాణికుల చార్జీలు కిలోమీటరుకు ఐదు పైసల నుంచి పది పైసల మేర పెం చక తప్పదు. ప్రస్తుతం రైల్వే ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు.

మాకు నిధులు కావాలి. లేకుంటే రైల్వే మనుగడ కష్టమవుతుంది’’ అని రైల్వే శాఖ సహాయమంత్రి కె.జె.సూర్యప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ శాఖ మరో సహాయమంత్రి అధిర్ రంజన్ చౌధరి కూడా వెంటనే చార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘రైల్వే ఆర్థిక పరి స్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికుల చార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది రైల్వేకు రూ.22 వేల కోట్ల నష్టాలు వచ్చా యి. గతేడాదితో పోలిస్తే ఇది రూ.4 వేల కోట్లు ఎక్కువ’’ అని వివరిం చారు.

మరోవైపు చార్జీల పెంపును రైల్వే బడ్జెట్ ముందు నుంచే అమలు చేయాలా లేక రైల్వే బడ్జెట్‌లో దీన్ని ప్రకటించాలా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రైల్వే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. పెంపు ఎంత ఉంటుందని అడగ్గా.. గత రైల్వే బడ్జెట్ ప్రతిపాదించిన మేరకు 10 నుంచి 15% మధ్య ఉండొచ్చని బదులిచ్చా రు. మరోవైపు రైల్ టారిఫ్ అథారిటీ(ఆర్‌టీఏ) ఏర్పాటుకు సంబంధిం చి తుది సిఫార్సులను ఖరారు చేసి ఈనెల 31లోగా సమర్పించాలని ప్రధాని కార్యాలయం(పీఎంఓ).. రైల్వే బోర్డు చైర్మన్‌కు సూచిం చింది. ప్రయాణికుల చార్జీలతోపాటు రవాణా చార్జీలను ఎంతమేర పెంచాలనే అంశాలపై ఆర్‌టీఏ తగిన సూచనలు సలహాలు ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్‌టీఏ ఏర్పాటు ఎంత వరకు వచ్చిందని రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్‌ను అడగ్గా.. ఆ పని నడుస్తోందని పేర్కొన్నారు.

రెండు నెలల ముందే సంకేతాలు: రైల్వే చార్జీల పెంపుపై ఆ శాఖ మంత్రి బన్సల్ రెండు నెలల ముందే సంకేతాలిచ్చారు. రైల్వే ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేనందున త్వరలో చార్జీలు పెరగవచ్చని అప్పుడు సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరులోగా రూ.70,147.74 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని రైల్వేశాఖ బడ్జెట్‌లో లక్ష్యంగా నిర్దేశించుకోగా, 3.23 శాతం తక్కువగా రూ.67,879.95 కోట్లు మాత్రమే ఆర్జించగలిగింది. ప్రయాణికుల విభాగంలో రూ.18,196.46 కోట్ల లక్ష్యానికిగాను రూ.17,691.43 కోట్లే ఆర్జిం చింది. రవాణా విభాగంలో కూడా లక్ష్యానికి చేరుకోలేకపోయింది. ఇందులో అక్టోబర్ నెలాఖరుకు 48,580.09 కోట్లు ఆర్జించాల్సి ఉం డగా, రూ.46,805.48 కోట్లకే పరిమితమైంది. అనుకున్న మేరకు ఆదాయం రాకపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికా వ్యయం రూ.60,100 కోట్ల నుంచి రూ.55,881 కోట్లకు తగ్గిపోయింది. ‘‘నిధులకు తీవ్ర కొరత ఉన్నందున చాలా ప్రాజెక్టులు పెం డింగ్‌లోనే ఉన్నాయి.

వీటికోసమే కాకుండా భద్రతా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, ప్రయాణికుల సౌకర్యాలను పెంపొందించేందుకు మాకు నిధులు కావాలి’’ అని సూర్యప్రకాష్‌రెడ్డి తెలిపారు. ప్రస్తు తం కొత్త లైన్లు, గేజ్ మార్పిడి, డబ్లింగ్‌కు సంబంధించి 347 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, ఇవి పూర్తి కావాలంటే నిధులు కావాలని, చార్జీలు పెంచకపోతే నిధులు ఎక్కడ నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. మరోవైపు రైల్వే బడ్జెట్ వరకు ఆగకుండా వెంటనే చార్జీల పెంపు ప్రకటించాలని అఖిల భారత రైల్వేమెన్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా సూచించారు. ప్రస్తుతం రైల్వే ఆర్థిక స్థితిగతులు దారుణంగా ఉన్నందున వెంటనే పెంపుపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. సాధారణ, స్లీపర్, థర్డ్ ఏసీ తరగతుల్లో చార్జీలు గత తొమ్మిదేళ్లుగా పెరగలేదు. ఈ నేపథ్యంలో 2012-13 బడ్జెట్‌లో ఆ చార్జీలను 10 శాతం నుంచి 15 శాతం మేర పెంచాలని అప్పటి రైల్వే మంత్రి దినేష్ త్రివేది ప్రతిపాదించారు. అయితే అనంతరం ఆయన రాజీనామాతో పెంపు ప్రతిపాదన అమలు కాలేదు.

AddThis Social Bookmark Button

Law Point

JA Teline IV
Friday @ 9PM

Praja Prasthanam

JA Teline IV
@ 9.30AM

The Prime Time Show

JA Teline IV
Mon to Thu @ 9PM

Ding Dong

JA Teline IV
wed & Sat @ 8.30PM

Bhavita

JA Teline IV
Sunday @ 9.30AM