నరేంద్ర మోడీ ఘన విజయం
- Details
- Published on Thursday, 20 December 2012 11:18
గుజరాత్ తన కంచుకోట అని నరేంద్ర మోడీ మరోసారి నిరూపించారు. ముచ్చటగా మూడోసారి మోడీ విజయ కేతనం ఎగురువేశారు. మణినగర్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి శ్వేతాభట్పై 47వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అంతే కాకుండా పటేళ్ల ప్రభావం ఉన్న సౌరాష్ట్రలోనూ మోడీ తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. జనాగఢ్ జిల్లా మంగ్రోల్లో బీజేపీ అభ్యర్థి రాజేశ్ భాయ్ గెలుపొందారు. మోడీ విజయంతో అహ్మదాబాద్ లోని బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.











