మాల్దీవుల మజీ అధ్యక్షుడి అరెస్ట్
- Details
- Published on Tuesday, 05 March 2013 15:40
మాల్దీవుల మజీ అధ్యక్షుడు మహ్మమద్ నషీద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను పోలీసులు రేపు కోర్టులో హాజరు పరచనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నషీద్ను ఆయన నివాసంలో అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు. స్థానిక కోర్టుకు హాజరు కాలేదన్న కారణంపై నషీద్ పై అరెస్టు వారెంటు జారీ అయింది.
మాల్దీవుల కోర్టు అరెస్టు వారెంటు జారీ నేపథ్యంలో నషీద్ భారత హైకమిషన్‌ను శరణు కోరిన విషయం తెలిసిందే. సుమారు 11రోజుల పాటు ఆయన హైకమిషన్ లో తలదాచుకున్నారు. 2012 వరకూ అధ్యక్షుడిగా కొనసాగిన నషీద్ అనూహ్య పరిణామాల మధ్య అధికారం కోల్పోయారు. అప్పటినుంచి అరెస్ట్ భయంతో ఆయన భారత రాయబార కార్యాలయంలో ఉన్నారు. అయితే నషీద్ ను అరెస్ట్ చేయబోమని మాల్దీవుల అధికారులు హామీ ఇవ్వటంతో బయటకు వచ్చారు.











