అలెగ్జాండ్రియాలో ఘర్షణలు
- Details
- Published on Saturday, 22 December 2012 17:26
ఈజిప్టులో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. కైరో నుంచి అల్లర్లు అలగ్జాండ్రియాకు పాకాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు అనేకమంది గాయపడ్డారు. కొత్త రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా ఈజిప్టు అట్టుడుకుతోంది.
ఈజిప్టులోని రెండో అతిపెద్ద నగరమైన అలెగ్జాండ్రియాలో జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. వందలాదిగా గుమిగూడిన ముస్లింలు, వారి ప్రత్యర్ధులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. కొత్త రాజ్యాంగం కోసం రెండో విడత రిఫరెండం నిర్వహణ సందర్భంగా ఈ అ ల్లర్లు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారుల్ని అదుపు చేశారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ఈ ఘర్షణలు ఎందుకు చెలరేగాయో అన్నది మాత్రం తెలియలేదు. కొత్త రాజ్యాంగం కోసం నిర్వహిస్తున్న రిఫరెండంకు ఒక వర్గం మద్ధతిస్తుండగా, మరో వర్గం వ్యతిరేకిస్తోంది. దీంతో గతకొన్ని వారాలుగా ఈజిప్టు రగులుతోంది.











