డ్యూటీలో డాన్స్‌లతో ఆకట్టుకుంటోన్న ట్రాఫిక్‌పోలీస్
- Details
- Published on Saturday, 22 December 2012 10:55
అమెరికాలోని రోడ్ ఐలండ్‌లో ఓ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ అందర్నీ ఆకట్టుకుంటున్నారు.క్రిస్మస్ సెలవుల సందర్భంగా ఆయన హడావుడి మరీ ఎక్కువైంది. ఒకవైపు.. ట్రాఫిక్‌ను నియంత్రిస్తునే మరోవైపు..రోడ్డు మీద వచ్చేపోయే జనానికి వినోదం కల్పించడం ఆయన ప్రత్యేకత. పేరు టోనీ లెపోర్. రోడ్ ఐలండ్‌లో డ్రైవర్లు, పాదచారులు, ప్రయాణికులు అంతా ఆయన ఫ్రెండ్సే. డిస్కో సల్సా నృత్యాలను కలిపి.. అలా.. రోడ్డుమీద డ్యూటీ చేస్తున్నచోటే.. రకరకాల డ్యాన్సులు చేసే టోనిని చూసేందుకు ఎంతో మంది అభిమానులూ ఆయన కోసం వస్తారు. ప్రత్యేకించి.. కొందరు అమ్మమ్మ వయసు వారు టోనీని చూసి పలకరించిపోందే రోజును ముగించరు. తనకు జీతంతో పాటు.. జీవితం ఇచ్చే అమెరికా ప్రజానీకంలో పదిమందినైనా వినోదపరచడం తనకు తృప్తినిస్తుందనే టోనీ.. మిడిల్ రోడ్ డ్యాన్స్‌ను ఇప్పుడు చూద్దాం. నిజానికి ఆయనది ఫ్యాన్సీ ఫుట్‌వర్క్.











