షర్మిల 83వ రోజు పాదయాత్ర షెడ్యూల్
- Details
- Published on Wednesday, 06 March 2013 09:27
మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర బుధవారం నరసరావుపేట నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
బసచేసిన ప్రాంతం నుంచి బుధవారం ఉదయం బయలుదేరి నరసరావుపేట మండలంలోని ములకలూరు, ఇసప్పాలెం మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడినుంచి నరసరావుపేట పట్టణం బైపాస్‌రోడ్ మీదుగా బరంపేట, పెద్దచెరువు సెంటర్, పల్నాడురోడ్ మీదుగా పాతపల్నాడు బస్టాండుకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం గుంటూరు రోడ్, క్రిస్టియన్‌పాలెం మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
నరసరావుపేట మండలం: ములకలూరు, ఇసప్పాలెం
నరసరావుపేట పట్టణం: బైపాస్‌రోడ్, బరంపేట,
పెద్దచెరువు సెంటర్, పల్నాడు రోడ్, పాతపల్నాడు బస్టాండ్, గుంటూరురోడ్, క్రిస్టియన్‌పాలెం











