‘బాబు బుద్ధి చెప్పినట్లే కాంగ్రెస్‌కు చెప్పండి’
- Details
- Published on Sunday, 03 March 2013 13:58
గతంలో చంద్రబాబుకు బుద్ధి చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ధూళిపాళ కాలనీ వాసులకు పిలుపునిచ్చారు. మరో ప్రజా ప్రస్థానం పేరటి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రలో భాగంగా ఆదివారం ధూళిపాళ్ల కాలనీలో రచ్చబండ నిర్వహించించారు.
జననేత మరణంతో ఆయన ప్రవేశపెట్టిన పథకాల లబ్ధి తమకు అందడం లేదని కాలనీవాసులు షర్మిలకు విన్నవించారు. కడప ఎంపి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయితే మంచి రోజులు వస్తాయని ఈ సందర్భంగా వారికి షర్మిల భరోసా ఇచ్చారు. పిల్లలను బాగా చదివించాలని వారికి సూచించారు. ఎంత కష్టం వచ్చిన పొలాలు మాత్రం అమ్ముకోవద్దని రైతులకు షర్మిల హితవు పలికారు.











