నటి రాజసులోచన కన్నుమూత
- Details
- Published on Tuesday, 05 March 2013 10:20
అలనాటి ప్రముఖ నటి మరియు కూచిపూడి, భరత నాట్య నర్తకి రాజసులోచన (77) మంగళవారం కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆగస్టు 15, 1935లో జన్మించిన రాజసులోచన స్వస్థలం విజయవాడ. ప్రముఖ దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు(సీఎస్ రావు)ను ఆమె వివాహమాడారు.
'కన్నతల్లి' చిత్రం ద్వారా రాజసులోచన వెండితెరకు పరిచయం అయ్యారు. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ చిత్రాల్లో కలిపి సుమారు 275 చిత్రాల్లో నటించారు. రాజసులోచన మృతి పట్ల చిత్రసీమ ప్రముఖులు సంతాపం తెలిపారు.











