నేడు బ్యాంకుల బంద్
- Details
- Published on Thursday, 20 December 2012 07:37
అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు గురువారం బ్యాంకుల బంద్ జరుగుతుందని జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ అధ్యక్షుడు కేశవరావు, కార్యదర్శి పి.ఎస్.మల్లేశ్వరరావు, ఏపీ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య సహాయ ప్రధాన కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఏఐబీఈఏ, ఏఐబీ ఓఏ, బీఈఎఫ్‌ఐ, ఎన్‌యూబీఐ యూని యన్లకు చెందిన ఉద్యోగులు, అధికారులు ఈ సమ్మెలో పాల్గొంటారని చెప్పారు.
లోక్‌సభ బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు ఆమోదాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకుల విలీన ప్రక్రియను సులభం చేయడం, ప్రభుత్వ బ్యాంకులలో ఒక శాతం నుంచి పది శాతానికి, ప్రైవేటు బ్యాంకుల్లో 10 నుంచి 26 శాతానికి వాటాదారుల హక్కు పెంచడం, ప్యూచర్ ట్రేడింగ్ కార్యకలాపాలకు ఈ బిల్లు అవకాశం ఇస్తుందని చెప్పారు. వీటిని నిరసిస్తూ బంద్‌కి పిలుపిచ్చినట్లు చెప్పారు. గురువారం ఉదయం 10.30 గంటలకు సీతమ్మధారలోని ఆంధ్రాబ్యాంకు జోనల్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సీఐటీయూ నగర కమిటీ ఉపాధ్యక్షుడు జి.రాజేశ్వరరావు ఒక ప్రకటలో తెలిపారు.











